2 July, 2026 | 7:08 PM

నాయకుల్లో మార్పు రావాలి

11-05-2024 12:05 AM

ప్రజలకు నీతులు చెప్పే రాజకీయ నాయకులు ముందు తాము ఓటు విలువ తెలుసుకోవడం ఎంతో మంచిది. ఇది తెలియనందునే అధికారం చేతికి రాగానే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఓటర్లను అవమానిస్తుంటారు. ఇవాళ ‘విజయక్రాంతి’ ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. అలాగే, నేటి యువత ప్రత్యేకించి సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు మాదక ద్రవ్యా లకు అలవాటు పడుతుండటం బాధాకరం. తల్లిదండ్రులు పిల్లల పోకడను ఒక కంట కనిపెడుతుండటం తప్పనిసరి.

రవీందర్, వేములవాడ