2 July, 2026 | 5:23 PM

బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయండి

11-05-2024 12:05 AM

హైదరాబాద్  సికిందరాబాద్ జంట నగరాలలో సిటీ బస్సు రూట్లలో అనేక ప్రాంతాలలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదా॥కు ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు ఒక్క బస్సు షెల్టర్ కూడా లేదు. చివరకు ఉప్పల్ బస్సు డిపోవద్ద కూడా లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, విద్యార్థుల అవస్థలు చెప్పనలవి కాదు. మహిళలకు ఉచిత బస్సు పేరుతో లక్షలా ది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం ప్రయాణికుల కోసం బస్టాండ్లలో స్థిరమైన షెల్డర్‌లను ఏర్పాటు చేయలేదా?

కె. ప్రకాశ్, నారపల్లి