24 April, 2026 | 1:46 PM

గ్రామీణ మహిళల గోడు

09-03-2025 12:00 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై దృష్టిపెట్టడానికి మనకొక అవకాశం ఇచ్చింది. వ్యవసాయాధారిత దేశంలో ఈ రంగానికి కీలకంగా ఉన్న గ్రామీణ మహిళల సమస్యల గురించి ఆలోచించడం లేదేమోనన్న విమర్శలు వినిపి స్తున్నాయి. ఎందుకంటే వ్యవసాయ రంగంలో పురుషులది ఎంత పాత్ర ఉందో మహిళలదీ అంతే పాత్ర ఉంటుంది.

అయితే గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో పొలాల్లో పని చేసే మహిళలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతకొద్ది సంవత్సరాలుగా ఏడాదికి 318 రోజులు దేశం తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ‘డౌన్ టు ఎర్త్ ’ సంస్థ నిర్వహిస్తున్న గణాంకాలను బట్టి అర్థమ వుతోంది.

ఈ ఏడాది మార్చి నెలలోనే  దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత మండుతాయని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ సమస్య ఈ ఒక్క ఏడాదిది కాదు. దశాబ్దాలుగా గ్రామీణ వ్యవసాయ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యే.

ఎందుకంటే దేశ జనాభాలో దాదాపు సగం మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయ రంగం లో నిమగ్నమైన వాళ్లే వీళ్లలో సగం మంది మహిళలు. దేశంలో వ్యవసాయం చాలావరకు వర్షాధారమే అయినా ఇప్పటికీ చాలా భూమి మెట్టపంటల సాగులోనే ఉంది. అయితే ఏటికేడాది పంట దిగుబడులు తగ్గు తుండడంతో చాలామంది గ్రామీణ మహిళలు రోజువారీ కూలీలుగా మా రుతున్నారు.

ఒక లెక్క ప్రకారం ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో 40 శాతం మహిళలే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా 2050 నాటికి దేశంలో గోధుమ దిగుబడి 18.6 శాతం, వరి దిగుబడి 10.8 శాతం తగ్గుతుందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాల సీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం చెబుతోంది.

వ్యవసాయ కార్మికుల్లో దాదాపు 60 శాతం నాట్లు వేయడం,90 శాతం మంది మహిళలు  కోతల తర్వాతి పనుల్లో ఉంటున్నారు. వేసవిలో గ్రామీణ మహిళల్లో ఎక్కువ మం ది తాగునీటి సేకరణకే ఇప్పటికీ తమ సమయంలో ఎక్కువ భాగం ఖర్చు చేస్తున్నారు.

ప్రతి ఇంటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వతంగా ము గింపు పలుకుతున్నామని పాలకులు చెబుతున్న మాటలకు, వాస్తవానికి పొంతన ఉండడం లేదని వేసవిలో దేశంలోని ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్లినా కనిపించే దృశ్యాలే నిదర్శనం.పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం మహిళపైనే కాదు, వారి సంతానంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ము ఖ్యంగా తక్కువ ఆదాయ పర్గాల్లో ఇది ఎక్కువగా ఉంది. పుట్టే పిల్లలు బరు వు తక్కువగా ఉండడం, పోషకాహార లోపంతో అటు తల్లి, ఇటు చిన్నారులు బాధపడుతుండడం సర్వసాధారణమయింది. అన్నిటికీ మించి గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న మరో తీవ్ర సమ స్య ఇంకోటి ఉంది. అభివృద్ధి పేరుతో పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములను పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించడం పెరిగిపోతోంది.

సాగుభూమి విస్తీర్ణం తగ్గిపోవడంతో వ్యవసాయ సంబంధిత పనులు కూడా తగ్గిపోతున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకణ పెరి గిపోవడంతో మహిళలకు ఉపాధి దొరకడం కష్టమయిపోతోంది. వీటన్నిటికీ ప్రధాన కారణం పర్యావరణంలో వస్తున్న మార్పులు. కొన్ని చోట్ల వి పరీతమైన వర్షాలు, వరదలు, మరికొన్ని చోట్ల భరించలేని కరవులు సర్వసాధారణమయిపోయాయి.

ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టిపెట్టి వ్యవ సాయ భూములను వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించే విషయంలో కఠినమైన నిర్ణయాలు తక్షణం తీసుకోకపోతే రాబో యే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ మహిళలు వలస కూలీలుగా మారిపో యే ప్రమాదం ఉంది.

తెలంగాణలోని పాలమూరు, ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు ఎదుర్కొన్న పరిస్థితులు దేశమంతటా వచ్చే రో జులు ఎంతో దూరంలో లేవని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు.