నిలబడిన కాపురం
ఆచార్య మసన చెన్నప్ప :
కాపురాలు కూలిపోవడానికి పెద్దగా సమయం పట్టక పోవచ్చు. కానీ, నిలబడడం మాత్రం అంత తేలి క కాదు. ఈ జీవితసత్యాన్ని తెలిసిన వాణ్ణి కనుకే, నా ప్రియమిత్రుల పిల్ల ల కాపురం నిలుపడం కోసం నావం తు కృషి చేశాను. ఈతరం పిల్లలకు భార్యాభర్తల మధ్య ఉండే పవిత్రబంధం విలువ తెలియకే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
అది గ్రహించగల అవకాశం పెద్దలుగా మనమే వారికివ్వాలి. ఆయన మా విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు పెద్ద అధికారి. వీసీ తర్వాత రిజిస్ట్రారు, ఆ పిమ్మట ఆయనే. తనకూ, నాకూ స్నేహం ఎంతంటే కుటుంబ సమస్యలైనా చెప్పుకొనేంత.
ఆయన మగపిల్లలు అందరూ ఇంజినీర్లే. తొలుత ఇద్దరూ అమెరికాలోనే సెటిలయ్యారు. ఒకతను తిరిగివచ్చి, మన దేశంలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు ఆ మిత్రుడు నాతో అన్నాడు
“మీవల్ల ఒక శుభకార్యం జరగాలి..”
‘తన కుమారుడు ఒక డాక్టర్ అమ్మాయిని చూశాడని, ఆమె తండ్రి తనకు చాలా పరిచయమే కాని, డాక్టరమ్మాయి పీజీ చేస్తూ తన సాఫ్ట్‌వేర్ కొడుకును పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఎట్లాగైనా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చచెప్పి శుభకార్యం జరిగేట్లు చూడాలని’ అభ్యర్థించాడు.
సాఫ్ట్‌వేర్ అబ్బాయిని సాఫ్ట్‌వేర్ అమ్మాయి, మెడికోను మెడిసిన్ చదివిన అమ్మాయి ఇష్టపడడం సహ జం. కానీ, ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ అబ్బాయి స్వయంగా డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలోనే తెలిసిన వారి జోక్యం అవసరమవుతుంది. అమ్మాయి తల్లిదండ్రులతో మా ట్లాడి, ఎలాగైతేనేం పెళ్లికి ఒప్పించాను. పెళ్లి అయ్యాక, “కలకాలం సుఖంగా ఉండమని” ఆశీర్వదించాను.
కొత్త దంపతులు సుఖంగా ఉంటే కుదిర్చిన వారికి సంతోషం. భిన్నంగా జరిగితేనే సమ స్య. నాతో అప్పుడప్పుడు ఆ అమ్మా యి, ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రు లు మాట్లాడే వారు “బాగానే ఉన్నారు పిల్లలు” అని. వారి అనురాగానికి గుర్తుగా ఒక కుమారుడు కూడా కలిగాడు. అతడు పది చదివేంతగా ఎదిగాడు.
ఈ దశలో అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటనతో షాక్‌కు గురయ్యా ను. ఒకరోజు అబ్బాయి తండ్రి మా ఇంటికి వచ్చాడు. అప్పటికి ఇద్దరం విశ్రాంత ఉద్యోగులమే కాబట్టి చాలాసేపు మాట్లాడుకున్నాం. మెల్లగా అసలు విషయం చెప్పాడాయన.
“మా కోడలు.. మా వాడితో కాపురం చేయదట. విడాకులు ఇవ్వకపోతే ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేస్తుందట. కానీ, మేం ఒప్పుకోవడం లేదు. దీనికి మీరే ఏమైనా పరిష్కార మార్గం చూపాలి..”
‘అయ్యో! నేనెందుకు వారి పెళ్లి విషయంలో తల దూర్చితి నో గద!’ అని చాలాసేపు బాధ పడ్డాను. ఆ అమ్మాయి తండ్రికూడా నాకు బాగా తెలిసిన వారు కనుక, ఒకరోజు ఫోన్ చేసి పలకరించాను.
నాకు అతని వియ్యంకునివల్ల ‘విషయం తెలిసిందని’ భావించి కాబోలు, ఏకంగా తమ అమ్మాయిని వెంట పెట్టుకుని సరాసరి మా ఇంటికి వచ్చారు. వారికి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికి, విషయం అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలకు నా తల తిరిగి పోయింది.
“అంకుల్! మా పెళ్లి జరిగి 18 సంవత్సరాలైంది. ఒక్కరోజు కూడా నాకు సుఖం లేదు. నేను డాక్టర్‌గా సంపా దించుకున్న డబ్బుతోనే పిల్లవాణ్ణి చదివించుకుంటున్నాను. అతడు నాకెన్నడూ ఏమీ కొనివ్వలేదు. ఏమైనా అడిగితే, ‘నేను అమెరికాకు వెళ్లిపోతాను’ అని బెదిరిస్తాడు. మా కుటుంబం ఆర్యసమాజ భావాలు కలిగింది కనుక ఇంతకాలం సహించాను..”
కొద్ది నిమిషాలపాటు నాకేం మాట్లాడాలో బోధ పడలేదు.
“ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు?” అడిగాను.
“నా ముందు రెండు మార్గాలున్నాయి. విడాకులు తీసుకోవడం, లేకపోతే గృహహింస కింద కేసు పెట్టడం..” ఆ అమ్మాయి తన నిర్ణయాన్ని చాలా సూటిగానే చెప్పింది.
సర్దుబాటు, సహనం పునాదులుగా..
ఆమె మాటలు వినడమే నా వంతైంది. ఆ అబ్బాయి ఆమెను ఎంతగా బాధ పెట్టాడో అర్థమైంది. ఆమె పూ ర్తిగా అతణ్ణి వదిలించుకోవడానికే సిద్ధమైందంటే, బాగా ఆలోచింపదగిన సమస్యే అనిపించింది. ‘వదులుకోవాలని అమ్మాయి వాళ్లు, వదులుకోవద్దని అబ్బాయి వా ళ్లు’. అప్పుడు నా సిక్త్స్ సెన్స్ ఏదో చెప్పింది, కాపురం నిలబెట్టే పనిగా ఒక చిన్న ప్రయత్నం చేయమని. ఆ అమ్మాయితో అన్నాను-
“నేను కొంత ప్రయత్నిస్తాను. అతడు దారికి వస్తాడేమో చూద్దాం..”
అప్పుడామె అంది.
“అతడు నాకు ఇన్నేళ్లునా ఒక్క గ్రాము బంగారం కొనిపెట్టలేదు. పిల్లవానికి బట్టలు కూడా కొని ఇవ్వలేదు. బడి ఫీజులు కూడా కట్టలేదు. దేశంలో ఒకచోట కూడా స్థిరంగా ఉండనివ్వడు. ‘ఇవ్వాళ బెంగళూరు, రేపు మద్రాసు, ఎల్లుండి బొంబాయి’ అంటాడు. ఏమై నా అంటే, ‘నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీరును’ అని మాట్లాడతాడు..” అంది కళ్లనీళ్ల పర్యంతమవుతూ.
నాకు విషయం స్పష్టమైంది. ‘అమ్మాయి స్వభావం సాత్వికం. అబ్బాయి స్వభావం రాజసం’. అందుకే ఇద్దరికీ ‘పడడం లేదని’ గ్రహించాను.
“ప్రయోజనం లేదండీ. ఆమె జీవితంలో బాగా విసిగిపోయింది. తనను పూర్తిగా మీ అబ్బాయి నిర్లక్ష్యం చేశాడు..” అన్నాను అబ్బాయి తండ్రితో కొంచెం కఠినంగానే.
ఆయన నన్ను మరీమరీ అభ్యర్థించాడు, ‘పిల్లలను ఎలాగైనా కలపాలని’. ఆశ్చర్యం ఏమిటంటే, ఇరు కుటుంబాల వారూ నాకు బాగా పరిచయమున్న వారే. కానీ, పిల్లలవల్ల ఏర్పడిన సమస్యకు పరిష్కారం వాళ్లకే అప్పగించాను.
ఒకరోజు ఇరువురినీ సమావేశ పరిచాను. అమ్మా యి చెప్పినవన్నీ ‘నిజమని’ అబ్బాయి ఒప్పుకున్నాడు. ‘పొరపాటైందని, క్షమించమనీ..’ అడిగాడు. అంతటితో అమ్మాయి మనస్సు మారుతుందా? గాయపడిన హృదయం మలాం పూస్తే బాగవుతుందా? అందుకే, అందరి ముందు ఒక ప్రతిపాదన చేశాను.
“18 సంవత్సరాలు నీ వేధింపులను తాను భరించింది కదా. నేటినుంచి అంతే కాలం పాటు నువ్వు ఆ మె మనసు గెలిచే ప్రయత్నం చేయాలి. తాను చెప్పినట్టు నువ్వు వినక తప్పదు. అప్పటికీ తాను మన్నిస్తే..” అన్నాను ఒక తీర్పు చెబుతున్నట్టుగా. దానికి ఆ అబ్బా యి సమ్మతించాడు. అమ్మాయి వాళ్లుకూడా నా మాటలకు ఎదురు చెప్పలేదు. అట్లా, నాకు తెలిసిన ఆ ఇరు కుటుంబాలను ఏకం చేసే భాగ్యం నాకు నాలుగేండ్ల క్రితం కలిగింది.
ఈమధ్య కాలంలో వారిమధ్య ఎలాం టి సమస్యా ఉత్పన్నం కాలేదని చెప్పలేను. కానీ, సర్దుబాటు, సహనం అనే రెండు సుగుణాలు లేకపోతే కాపు రాలు నిలవలేవు. మానవ జీవితాలు చెట్లకొమ్మలు కా వు, కొట్టేస్తే మళ్లీ పెరగడానికి! ఇప్పటికీ నాతో ఆ అమ్మా యి- ఆ అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు. అదృష్టవశాత్తు ఎలాంటి షికాయత్ చేయనందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
వ్యాసకర్త సెల్: 9885654381






