calender_icon.png 8 June, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మస్క్‌కు రష్యా బంపరాఫర్

08-06-2025 12:27:53 AM

  1. రాజకీయ శరణార్థిగా ఆశ్రయమిచ్చేందుకు సై
  2. రష్యా స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ వ్యాఖ్యలు కలకలం
  3. స్పేస్ ఎక్స్‌ను బ్యాన్ చేయాలన్న ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ బెనాన్

వాషింగ్టన్, జూన్ 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో ట్రంప్‌తో విభేదించి ఇప్పటికే డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) నుంచి తప్పుకున్న మస్క్ అధ్యక్షుడు ట్రంప్ మీద మాటల దాడి మొదలుపెట్టారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా.. కొత్త పార్టీపై కూడా ప్రజాభిప్రాయం సేకరించారు.

ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగా నే రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రి నోవికోవ్ మరో పెద్ద బాంబు పేల్చారు. మస్క్‌కు రాజకీయ శరణార్థిగా ఉండేందుకు అవకాశం కల్పిస్తామన్నా రు. రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ టాస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మస్క్ విభిన్నమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడని నే ను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శ రణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు.

ఒక వేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తుంది. మూడేండ్ల తర్వాత డెమొక్రాట్లు తిరిగి శ్వేతసౌధానికి రావాలని మస్క్ కోరుకోడని భావిస్తున్నా. వారి మధ్య కొన్ని వ్యూహాత్మక భేదాలున్నాయి.’ అని పేర్కొన్నా రు. ఇప్పటికే అమెరికాకు చెందిన స్నోడెన్‌కు  రాజకీయ శరణార్థిగా రష్యా అవకాశం కల్పించింది.

అయితే ట్రంప్‌మస్క్ వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించినట్టు ‘మాస్కో టైమ్స్’ పేర్కొంది. ఇది అమెరికా సమస్య అ ని తమకు ఇందులో జోక్యం చేసుకునే ఉద్దే శం లేదని తెలిపారు. 

మస్క్ ఓ అక్రమ గ్రహాంతర వాసి

ఎలాస్ మస్క్ ఓ అక్రమ గ్రహాంతర వాసి అని గతంలో వైట్‌హౌజ్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్ బెనాన్ విమర్శించారు. వెం టనే మస్క్‌ను దేశం నుంచి బహిష్కరించి.. ఆయన స్పేస్ ఎక్స్ కంపెనీని సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

బిగ్ బాంబ్ పోస్ట్ డిలీట్.. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఆరోపణలు గుప్పిస్తూ అతిపెద్ద బాంబ్ పేల్చాల్సిన సమయం ఆసన్నమైందని ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ను మస్క్ తొలగించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది అని చెప్పేందుకు ఇదో సూచిక అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా మస్క్ పెట్టే నూతన పార్టీ పేరు ‘ది అమెరికా పార్టీ’ అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మస్క్ ఇంకా స్పందించలేదు.