08-06-2025 12:31:10 AM
న్యూఢిల్లీ, జూన్ 7: సాధారణంగా భూమి పై ఎత్తున పర్వతం ఏదని అడిగితే అందరూ చెప్పే సమాధానం మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు సముద్ర మట్టం నుంచి 8,848 మీట ర్లు. అయితే ఎవరెస్ట్ కంటే ఎత్తున పర్వతాలు ఉన్న గ్రహాలు విశ్వంలో చాలానే ఉన్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సం స్థ నాసాకు చెందిన ఒడెస్సీ స్పేస్‌క్రాఫ్ట్ అంగారక గ్రహంపై అగ్నిపర్వతాన్ని గుర్తించింది.
దాని పేరే ‘ఆర్సియా మోన్స్’ అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం అంగారక గ్రహంలోని థా ర్సిస్ ప్రావిన్స్‌కు దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టు నాసా పేర్కొంది. ‘ఆర్సియా మోన్స్’ ఎత్తు 9వేల మీటర్ల ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో భూమిపై ఉన్న అత్యంత ఎత్తున పర్వ తంగా పేరు పొందిన ‘మౌంట్ ఎవరెస్’్ట ఎత్తును కూడా ఇది దాటిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా నాసా అగ్నిపర్వత ఫోటోలను తీసుకోవడానికి తన ఆర్బిటర్‌ను 90 డిగ్రీల కోణంలో తిప్పింది.
ఫలితంగా మార్స్ ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి రూపొందించిన థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్ (తెమిస్) కెమెరా అగ్ని పర్వతం ఫోటో తీయడానికి సహాయపడింది. అయితే అంతరిక్ష కేంద్రం నుంచి నాసా పంపిన ఫోటోలు పరిశీలిస్తే.. ‘ఆర్సియా మోన్స్’ అగ్నిపర్వతం అంగారక గ్రహం ఆకాశాన్ని చీల్చు కొని పైకి రావడం స్పష్టంగా గమనించొచ్చు. కాగా మంచు కరిగిన ఈ అగ్నిపర్వతంలో చా లా ప్రాంతాల్లో ఖనిజాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అగ్ని పర్వతం కింద ఐస్ గ్లేసియర్
‘ఆర్సియా మోన్స్’ అగ్నిపర్వతం పరిమా ణం, మార్పులను పరిగణలోకి తీసుకొని చూస్తే ఇది చాలా కాలం పాటు చురుకుగా ఉందని నాసా తెలిపింది. అయితే ‘ఆర్సియా మోన్స్’ అగ్నిపర్వతం కింద ఐస్ గ్లేసియర్ కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నా రు. దీనిద్వారా భవిష్యత్తులో అంగారకుడి పరిణామాన్ని కూడా తెలుసుకునే అవకాశముంది. ఇప్పటివరకు ‘ఆర్సియా మోన్స్’ శిథిలమైన స్థితిలో ఉండటంతో గుర్తించడం కష్టంగా మారిందని..
తాజాగా అక్కడి వాతావరణ పరిస్థితులు మారడంతో అగ్నిపర్వతం బయటపడిందని నాసా స్పేస్ ఫ్లుటై సెంటర్లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా విధులు నిర్వహి స్తున్న డాక్టర్ మైకెల్ డి. స్మిత్ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే అంగారక గ్రహంపై మరో పెద్ద అగ్ని పర్వతం ఉందన్న విషయం తెలిసిందే. దానిపేరు ‘ఒలింపస్ మోన్స్’.. ఈ అగ్ని పర్వతం 22 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం గమనార్హం.