21 June, 2026 | 1:50 AM

రుయ్యాడి సవర్ల మొహర్రం

21-06-2026 12:33 AM

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సవర్ల పం డుగ (మొహర్రం) వేడుకలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుం టారు.  ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యా డి, తాంసి మండల ంలోని బండల నాగపూర్, కప్పర్ల గ్రామాలు మొహర్రం పండుగకు పెట్టింది పేరు. మొహ ర్రం నెల మొదలైనప్పటి నుండి భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తూ కాలికి చెప్పులు లేకుండా ఉన్నారు. తాంసి మండల కేంద్రంలో ప్రముఖ బుడ్డన్ సవారీ ఊరేగింపును పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. 

మద్యం, మాంసానికి దూరం

తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని సవర్ల వేడుకకు ప్రత్యేక ఉం ది. గ్రామాల్లోని హస్సేన్ హుస్సేన్ దేవస్థానం పట్ల భక్తులు ఎంతో నమ్మకం ఉంది. వారం రోజులపాటు నియమనిష్టలతో హిందూ ముస్లింలందరూ కలిసికట్టుగా పండగలు జరుపుకుంటారు. మొహరం సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ పాదరక్షలు ధరించకుండా, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. మొహరం పండుగ జరిగిందని రోజులు దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనవాయితీ గా వస్తుంది.

రుయ్యాడిలో జరిగే మొహర్రం పండగకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, రాజకీయ నాయకులు తరలివస్తారు. రుయ్యాడి సవర్లను దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు. గతంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు హరీశ్‌రావు, కవిత, మాజీ మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాల చారి సవర్లను దర్శించుకున్నారు. అదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలు, అటుపక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు  తీర్చుకుంటారు. 

ఒక్కో గ్రామంలో ఒక్కో పేరు

ఒక్కో గ్రామంలో ఒక్కో పేరుతో సవార్లను పిలుచుకుంటూ వేడుకలను జరుపుకుంటారు. గ్రామ గ్రామాన సందడి నెలకొంటుంది. తాంసి మండల కేంద్రంలో కుర్లీ-బుడ్డన్ సవారీ, రాజేశ్వర్ సవారీ, పెద్ద సవారీ, కొమ్ముల సవారీలు, పొన్నారిలో మౌలాలి, పంజా, కొమ్ముల సవారీ, బచవలి పేర్లతో పిలుచుకునే సవార్లను గ్రామస్థులు ఆరాదిస్తున్నారు. భీంపూర్ మండలంలోని కరంజి టీ లో హస్సేన్- హుస్సేన్ సవార్లు, నిపాని గ్రామంలో ఇమామ్ కాశిం పంజా సవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. 

 బీర్కుర్ వార్ వెంకటేష్ (ఆదిలాబాద్, విజయక్రాంతి)

నియమనిష్ఠలతో పండుగ

మొహర్రం వచ్చిందంటే చాలు గ్రామంలో సందడి నెలకొంటుంది. వారం పది రోజులపాటు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా గ్రామస్థులు అందరం కలిసి పాదరక్షలు ధరించకుండా, మద్యం, మాంసానికి దూరంగా ఉం టాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన రుయ్యాడి సవాళ్లను దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కోరిన కోరికలు తీరడంతో  హస్సేన్ హుస్సేన్ దేవస్థానా న్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. 

- లోక భూమారెడ్డి, అధ్యక్షుడు, రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానం