30 August, 2026 | 8:38 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

గిరిజన గూడాల్లో గావ్ సాత్

30-08-2026 04:40 PM
  • పొలిమేర పోచమ్మ తల్లికి పూజలు

ఉట్నూర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ తర్వాత ఆదివాసీ గిరిజనులు పొలిమేర పోచమ్మ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆదివాసీ గూడాల్లోని ఆదివాసీ గిరిజనులు గావ్ సాత్ (ఇంటింటి బయట వంటలు) కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆదివాసీ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి పిల్లాపాపలతో కలిసి గ్రామ పొలిమేర వద్దకు వెళ్లి పోచమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటున్నారు. పొలిమేరలో అక్కడే వంటలు చేసుకుని పిల్లాపాపలతో కలిసి వనభోజనం చేశారు.

ఆదివాసీ గూడలోకి దుష్ట శక్తులు ఆవరించకుండా, ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన పంటలపై అడవి ప్రాణులు దాడి చేయకుండా కాపాడాలని ఆదివాసీ గిరిజనులు పోచమ్మ తల్లికి మొక్కుకున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని ఆదివాసీ గిరిజనులు చాలా గ్రామాల్లో ఆదివారం పొలిమేర పోచమ్మ పూజలు నిర్వహించారు.