30 August, 2026 | 5:54 PM

కరాటేలో నిర్మల్ విద్యార్థుల ప్రతిభ

30-08-2026 04:42 PM

నిర్మల్, ఆగస్టు 25 (విజయక్రాంతి):  జపాన్ కరాటే అసోసియేషన్ 18వ మాన్‌సూన్ ట్రైనింగ్ క్యాంప్ ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఇందులో నిర్మల్ విద్యార్థులు ప్రతిభ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.

జపాన్‌కు చెందిన ప్రముఖ మాస్టర్స్ తనియామా, వై. హకిజుమే, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ మాస్టర్ ఆనంద్ రత్న, తెలంగాణ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ సెన్సై రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడింది.

దీనికి అర్హులైన వారికి జపాన్ హెడ్‌క్వార్టర్స్ నుంచి సర్టిఫికెట్లు పంపించారు. ఈరోజు వాటిని సెన్సై తేజేందర్ సింగ్ అందజేశారు. ఇందులో సర్టిఫికెట్లు పొందిన వారు తేజేందర్ సింగ్, కొండాజీ శ్రీకాంత్, అమ్ముల భూషణ్, కిన్నెర్ల మృనాలిని, ఊరే శ్రీకాంత్, మనీషా, శరణ్య, ఆరిఫ్ ఖాన్, రిషికేష్. వీరికి సర్టిఫికెట్లు అందజేసి వారిని అభినందించారు.