30 August, 2026 | 5:54 PM

టీపీసీసీ ఆదేశాలు వచ్చేంతవరకు నూతన మండల ,గ్రామ కమిటీలు వేయవద్దు

30-08-2026 04:48 PM

తుంగతుర్తి (విజయ క్రాంతి): సంఘటన్ సుమన్ అభియాన్ చైర్మన్ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో మండల పార్టీ నియామకాల వలన సొంత పార్టీలో భేదాభిప్రాయాలు రావడంతో సీనియర్ కార్యకర్తలు, పెద్దలు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసి తుంగతుర్తి నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవడం జరిగింది. సమస్యల నివేదికపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ నిర్ణయం వచ్చేదాకా మండల కమిటీ, గ్రామ కమిటీలు ఎటువంటివి కూడా చేయకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తుంగతుర్తి నియోజకవర్గ నూతన అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై తుది నిర్ణయం వచ్చేంతవరకు నియోజకవర్గంలో ఎటువంటి నూతన గ్రామ కమిటీలు వేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. నూతన కమిటీలు వేసి, మళ్లీ పార్టీలో గందరగోళం సృష్టించవద్దని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొంగరి గోవర్ధన్, మడ్డి కృష్ణమూర్తి పాల్గొన్నారు.