22 June, 2026 | 4:33 PM

6 టాటా కంపెనీలకు ఎస్ అండ్ పీ పాజిటివ్ రేటింగ్

15-06-2024 12:05 AM

ముంబై, జూన్ 14: టాటా గ్రూప్‌లోని ఆరు కంపెనీలకు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ పాజిటివ్ క్రెడిట్‌వాచ్ రేటింగ్ ఇచ్చింది. టాటా గ్రూప్ కంపెనీలు టాటా మోటార్స్, టాటా స్టీల్, జాగ్వర్ అండ్ ల్యాండ్‌రోవర్, టాటా పవర్, టీఎంఎల్ హోల్డింగ్స్ పీటీఈ, ఏబీజేఏ ఇన్వెస్ట్‌మెంట్ కో పీటీఈలకు టాటా సన్స్ అసాధారణమైన ఆర్థిక మద్దతును అందిస్తున్న దని, టాటా సన్స్, గ్రూప్ కంపెనీల మధ్య నిర్వహణా అనుసంధానాన్ని తాము విశ్వసిస్తున్నామని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది. ఈ అంశాన్ని తాము ఇటీవల సమీక్షించామని, టాటా మోటార్స్, జేఎల్‌ఆర్‌ల మధ్య ఇంటిగ్రేషన్ కారణంగా వేరువేరు రేటింగ్‌లు అవసరమా అనే విషయా న్ని చర్చించామని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.