19 August, 2026 | 11:52 AM

కొనసాగిన ఎం అండ్ ఎం అప్‌ట్రెండ్

15-06-2024 12:05 AM

వరుసగా రెండో రోజు ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా జోరు కొనసాగింది. సెన్సెక్స్ బాస్కెట్‌లో క్రితం రోజు అన్నింటికంటే అధికంగా 3.7 శాతం లాభపడిన ఎం అండ్ ఎం గురువారం మరో 3 శాతం పెరిగి కొత్త రికార్డు స్థాయి రూ.2,925 వద్ద ముగిసింది. టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో,  బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ 2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, లార్సన్ అండ్ టుబ్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 1.5 శాతం వరకూ క్షీణించాయి. వివిధ రంగాల సూచీల్లో ఇండస్ట్రియల్స్ ఇండెక్స్  1.68 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 1.31 శాతం, ఆటోమొబైల్ ఇండె క్స్ 1.26 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.94 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.15 శాతం చొప్పున పెరిగాయి.  ఐటీ, టెక్నాలజీ సూచీలు తగ్గాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.18 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 1.03 శాతం ఎగిసింది.