ఇంటర్ ఫలితాల్లో ‘సాన్వి కళాశాల’ విజయదుంధుబి
కొత్తపల్లి, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఆదివారం రోజున ప్రకటించిన తెలంగాణా ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ పట్టణం రేకుర్తి కి చెందిన సాన్వి డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోనే అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎం.పి.సి మొదటి సంవత్సరం లో భూంపెల్లి అజయ్ కుమార్ 470 మార్కులకు గాను 466 మార్కులు,
కాసార్ల శ్రీరామ్ 464,పోలవేణి అభిరామ్ 462 మార్కులు, సి.ఇ.సి లో పి. అశ్వంత్ 462, కళ్లెం ధనుష్ 458 మార్కులు సాధించారు.ద్వితీయ సంవత్సరం లో అజయ్ 988, సిద్దార్థ రాయ్ 978,ఎన్.అజయ్ 976 మార్కులు సాధించారు. రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు,విద్యార్ధిని, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




