మెరిసిన కేజీబీవీ విద్యార్థులు
13-04-2026 12:41 AM
వెల్దుర్తి, ఏప్రిల్ 12: వెల్దుర్తి కేజీబీవీ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రతిభ సాధించినట్లు ఎస్‌ఓ పాతిమ తెలిపారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 100% ఫలితాలు సాధించారని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో మహాలక్ష్మి 925, స్పందన, 922, ఎంపీసీలో స్ఫూర్తి,890, మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫలితాలు ఎంపీస్ లో 443 శ్రీజిత సాధించి నట్టు తెలిపారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.




