బీరప్ప సాక్షిగా అబద్ధాలాడిన హరీశ్‌రావు
గుడి నిధులపై స్పష్టత కోరిన సదాశివరెడ్డి
నిధులు జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ ఇస్తే తానే ఇచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటు
సిద్దిపేట రూరల్, మే 5: దేవుడి సాక్షిగా అబద్ధాలు మాట్లాడిన అబద్దాల హరీశ్ రావుగా నిరూపించుకున్నాడని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ కేదారి సదాశివరెడ్డి విమర్శించారు. మంగళవారం రూరల్ మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో బీరప్ప గుడికి ఎస్డీఎఫ్ నిధులు రూ.5లక్ష లు ఇచ్చానని హరీశ్ రావు పచ్చి మోసపూరిత మాటలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. రూ.5లక్షల నిధులు ఎవరికీచ్చారు, ఎప్పుడిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారం రాగానే నాటి ఇన్ ఛార్జి మంత్రి కొండా సురేఖ దగ్గరికి వెళ్లి రూ.5లక్షల నిధులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. రూ.5లక్షల నిధులతో స్లాబ్ వరకు గుడిని నిర్మించామన్నారు.
గుడికి నిధులు సరిపోకపోవడంతో ప్రస్తు త ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి కలిశామని, అడగగానే రూ6.50వేల నిధులు మంజూరు చేశారని చెప్పారు. మరీ హరీశ్ రావు మంజూరు చేసిన నిధులు ఎవరు తిన్నారని ప్రశ్నించారు. నిధులను గోల్ మాల్ చేసి, పక్కదారి పట్టించడం హరీశ్ రావుకు కొత్తేం కాదన్నారు. వందల కోట్ల సీఎంఆర్‌ఎఫ్ నిధులను మింగిన చరిత్ర హరీశ్ రావుకు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుస్సాపూర్ హనుమాన్ ఆలయాని కి రూ.20లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారని, కానీ రూ.12 లక్షల నిధులే మంజూరయ్యయాని చెప్పారు.
మరీ మిగతా రూ.8లక్షల నిధులు ఎవరీ ఖాతాలోకి పోయాయని ప్రశ్నించారు. హనుమాన్ టెంపుల్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నది బీఆర్‌ఎస్సేనని మండిపడ్డారు. గుడి ఆవరణలోని రావి చెట్టు ను తొలగిస్తే గుడి నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు. హరీ శ్ రావు, ఆయన చెంచాలు తన గురించి ఇష్టరీతిగా మాట్లాడుతున్నారని, వారు నాలుకలను కొండ నాలుకలను బయ టకు గుంజే సమయం దగ్గరకొచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్, కిషన్ గౌడ్, కొండల్ రెడ్డి, ఎర్రం రాములు, పర్శరాములు, మల్లేశం గౌడ్, జిల్లా మత్స్య సహకార డైరెక్టర్ సురేశ్, బత్తినీ మల్లేశం పాల్గొన్నారు.






