నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
- కేరళం సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతల సమావేశానికి హాజరు
- కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం
- రెండోదశ మెట్రో విస్తరణకు నిధులు కోరనున్న సీఎం
- కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ప్రాజెక్టులపై సీబీఐ డైరెక్టర్‌ను కలిసి విచారణ కోరనున్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోపాటు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నది. కేరళంలో కాంగ్రెస్ కూ టమి విజయం సాధించడం, అక్కడ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే చర్చల్లో కూడా రేవంత్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉన్నది. కేరళంలో కాంగ్రెస్ విజయంలో రేవంత్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నది.
ఎన్నికల్లో స్టార్ క్యాం పెయినర్‌గా ప్రచారం నిర్వహించడమే కాకుండా ఎన్నికల్లో విజయం సాధించేందుకు కావాల్సిన వ్యూహాలను కూడా అమ లుచేశారు. దీంతో కేరళంలో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని భాగ స్వామ్యం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయంపై కేంద్ర మంత్రులను కూడా రేవంత్ కలిసే అకాశం ఉన్నది.
హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం పూర్తిగా స్వా ధీనం చేసుకోవడంతో రెండో విడత మెట్రో విస్తరణకు కావాల్సిన నిధులు విషయంపై కేంద్రాన్ని కలిసి కోరనున్నట్టు సమాచారం. ఇక ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణలో జరిగిన అవినీతి, అక్రమాలతోపాటు విద్యుత్ కొనుగోలు, యా ద్రాద్రి, భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరో పిస్తున్నది.
వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ చేయాలని అసెంబ్లీలో తీ ర్మానం చేసి కేంద్రానికి పంపించింది. సీబీఐ డైరెక్టన్‌ను కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం.
పంట మార్పిడిపై అసెంబ్లీలో చర్చిద్దాం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): పంట మార్పిడిపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొ న్నారు. ఇందుకు అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం సీఎంని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రైతు కమి షన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో బృందం కలిసింది. పంట మార్పిడికి సంబంధించి నివేదికను సీఎంకు అందజే శారు. పంట మార్పిడిపై అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూ చనలతో ముందుకు రావాలని సీఎం సూచించారు. సీఎంను కలిసి న వారిలో కమిషన్ సభ్యులున్నారు.






