23 March, 2026 | 3:54 PM

Breaking News

ఇది 1975 నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలన!.. రాంచందర్ రావు అరెస్ట్   •   భట్టి మాటలకు అర్థాలే వేరులే   •   ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లింగాల భూపాల్ ఎన్నిక   •   శ్రీ రామలింగేశ్వరలయం చైర్మన్‌గా అడ్డగుంట రాజేందర్   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అమరవీరుల దినోత్సవం   •   ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •  

పొనుగోడు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

10-10-2024 07:54 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని మహిళలందరూ రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకుని దేవాలయం వద్దకు తీసుకుని వచ్చి మహిళలకు, ఆడపిల్లలకు ఎంతో ప్రీతిపాత్రమైన సద్దుల బతుకమ్మ పండుగను పాటలతో, కోలాటాలతో బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సంబురాలు వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. గత ఎనిమిది రోజులపాటు తెలంగాణ ఆడపడుచులందరూ భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో సంబురంగా జరుపుకున్న బతుకమ్మ పండగ నేడు తొమ్మిదవ రోజుకు చేరుకుంది.