23 June, 2026 | 2:24 PM

Breaking News

పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •   రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం   •   సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్   •   ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలను సాగు చేస్తేనే రైతులకు బోనస్   •   గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి   •   డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు   •   హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణపై చ‌ర్చలు సఫలం   •   తడిసిన ధాన్యం పేరుతో రైతుకు టోకరా!   •  

సెమీస్‌లో సఫారీలు

22-06-2024 02:29 AM
  • ఇంగ్లండ్‌పై ఉత్కంఠ విజయం

సెయింట్ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ గ్రూప్ భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సఫారీ జట్టు 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు.

క్లాసెన్ (8), కెప్టెన్ మార్క్మ్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకు పరిమితమైంది. హ్యారీ బ్రూక్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు), లియామ్ లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో రబడ, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.