5 August, 2026 | 7:26 PM

సురక్షిత రహదారి.. సైబర్ మోసాలపై అప్రమత్తత

05-08-2026 06:53 PM

చౌటుప్పల్,(విజయక్రాంతి): సైబర్ స్వాతంత్ర తెలంగాణ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మార్కండేయ నగర్ జేబీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ‘సురక్షిత రహదారి–సురక్షిత జీవితం’ అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ్‌కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.

రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సైబర్ మోసాలపై పీసీ మమత అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద లింకులు, గుర్తుతెలియని కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అజయ్ భార్గవ్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాపురం జంగయ్య, కరస్పాండెంట్ నిర్మల, ఉపాధ్యాయులు మాధవి, రంజిత్, యువరాజు, స్వాతి, మమత, జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.