8 April, 2026 | 4:20 PM

Breaking News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •  

సహేందర్ రెడ్డి గెలుపు ఖాయం

10-02-2026 01:19 AM

మంథని 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి అడుగడుగునా జననీరాజనం  

మంథని, ఫిబ్రవరి 9(విజయ క్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ గా సీనియర్ వకీల్ సాబ్ ముస్కుల సహేందర్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబుల ఆశీస్సులతో పోటీ చేస్తున్న సహేందర్ రెడ్డి గెలుపునకు కుటుంబ నేపథ్యం కలిసి వచ్చే అంశం ఒక ఎత్తు అయితే, విద్యావంతుడుగా, న్యాయవాదిగా అందరితో కలుపుగోలుగా ఉండే సహేందర్ రెడ్డి గెలుపునకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

వ వార్డు పరిధిలోని గంగాపురి, కూచిరాజు పల్లి, శ్రీరాంనగర్, గొల్లగూడెం ప్రాంతాల సమస్యలపై పూర్తి అవగాహన ఉండటంతో మహేందర్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డి జిల్లా కిసాన్ సెల్ కన్వీనర్ గా ఎల్లవేళలా ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు కావడం సహేందర్ రెడ్డి గెలుపును మరింత సులభతరం చేసే అవకాశాలు ఉన్నాయి. వివాదరహితుడుగా, సౌమ్యనిగా మంచి పేరున్న సహేందర్ రెడ్డి గెలుపు మంథని మున్సిపాలిటీకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రైతు కుటుం బం నుంచి వచ్చిన స హేందర్ రెడ్డిని యు వత, మహిళలు, రైతు లు, రైతు కూలీలు అ న్ని వర్గాలకు చెందిన ప్రజలు ఆదరిస్తున్నా రు. ఈ సందర్భంగా సహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే 5వ వార్డు పరిధిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు.

వార్డు పరిధిలో తాగునీటి, రహదారుల సౌకర్యం, డ్రైనేజీ, విద్యుత్తు సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మంత్రి శ్రీధర్ బాబు, శ్రీనుబాబుల సహకారంతో ముందుకు వెళ్తానన్నారు. ప్రచారంలో సహేందర్ రెడ్డి వార్డు పరిధిలోని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు.