10-02-2026 01:17:38 AM
పాల్వంచ 46వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి విమలాదేవి
పాల్వంచ, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): పాత పాల్వంచ ఆడబిడ్డగా, ప్రతి సమస్యపై పూర్తిస్థాయి అవగాహన కలిగిన మనిషిగా, ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో కార్పొరేటర్ గా కాంగ్రెస్ మద్దతు పోటీ చేస్తున్నానని, హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 46వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కొత్వాల విమలాదేవి కోరారు. ప్రచారానికి చివరి రోజైన సోమవారం ప్రతి ఓటర్‌ను కలిసి స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఓట్లను అభ్యర్థించారు.
తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన, శాశ్వత అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, వనమా చిన్న బాబు, ఉమా మహేశ్వర రావు, కొత్వాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.