9 May, 2026 | 8:32 PM

హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సాయి కిరణ్ గౌడ్

09-05-2026 07:29 PM

మేడిపల్లి,(విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్ర యూనివర్సల్ హ్యూమన్ రైట్స్, లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా గడ్డమీది సాయి కిరణ్ గౌడ్ నియమితులయ్యారు.ఈ మేరకు ఫౌండర్ డైరెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి చేతుల మీదుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామక పత్రాన్ని సాయి కిరణ్ కు అందజేశారు.

అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు సహాయసహకాలు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయి కిరణ్ మాట్లాడుతూ, సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ తన ప్రధాన లక్ష్యమని,హక్కుల కోసం కృషి చేస్తానని,అలాగే ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.