calender_icon.png 18 October, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిరాం హాస్పిటల్‌కు హైబిజ్ టీవీ మీడియా సత్కారం

18-10-2025 01:52:04 AM

బెస్ట్ ఎమర్జింగ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అవార్డు అందజేత

ఖమ్మం, అక్టోబర్ 17(విజయక్రాంతి) : ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్ నందు గల ప్రముఖ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ‘సాయి రాం హాస్పిటల్’కు మరోసారి తన అత్యుత్త మ వైద్య సేవల నాణ్యమైన క్లిష్టతరమైన వైద్యం అందిస్తున్నందుకు ప్రముఖ మీడి యా సంస్థ హైబిజ్.టీవీ, హైదరాబాద్‌చే బెస్ట్ అవార్డు అందుకుంది. ఆ మీడియా సంస్థ నిర్వహించిన 5వ ఎడిషన్ హెల్త్‌కేర్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో సాయిరాం హాస్పిటల్‌కు బెస్ట్ ఎమర్జింగ్ మల్జీ స్పెషాలిటీ హాస్పి టల్ అవార్డు అందజేశారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్ హోటల్‌లో శు క్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మం త్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సాయిరాం హాస్పిటల్ వారు అందు కున్నారు. ఈ సందర్భంగా డా.స్వాతి జం గాల మరియు డా. సునీల్ కుమార్ జంగాల మాట్లాడుతూ గత 15 సంవత్చరాలుగా ఖ మ్మం పరిసర జిల్లాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఖమ్మంలో అందించదేమే కాకుండా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందు కు గాను ఈ అవార్డు మా సాయిరాం హా స్పిటల్‌కి ఒక గొప్ప గుర్తింపు అని అన్నారు.

ఇది ‘మా వైద్య బృందం కృషి, నిబద్ధత మరి యు ప్రజల విశ్వాసానికి ప్రతిఫలం. రాబో యే రోజుల్లో కూడా ఆధునిక వైద్య సాంకేతికతతో మరింత మెరుగైన సేవలను అందిం చే దిశగా ముందుకు సాగుతాం అని తెలిపారు.