అమెరికాకు నాకౌట్ బెర్త్
21-06-2026 12:00 AM
సియాటెల్, జూన్ 20 : సాకర్ ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా నాకౌట్‌లో అడుగుపె ట్టింది. గ్రూప్ డి పోరులో భాగంగా 2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సా ధించింది. దీంతో మరో మ్యా చ్ మిగిలుండగానే నాకౌట్ బెర్తును దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ఆట ప్రారంభమైన రెండో నిమి షం నుంచే అమెరికా దూకుడుగా ఆడింది.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కేమరాన్ బర్గెస్ బంతిని ఆపే ప్రయత్నం సెల్ఫ్ గోల్స్ చేయడంతో అమెరికా 1 ఆధిక్యంలో నిలిచింది. ఫస్టాఫ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు అమెరికా మరో గోల్ నమోదు చేసింది. సెకండాఫ్‌లో ఆ జట్టు వ్యూహాత్మకంగా డిఫెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది.






