14 May, 2026 | 5:59 PM

హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ గా సాజన్

14-05-2026 04:50 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మందమర్రి ఏరియా హెచ్ ఎం ఎస్ వైస్ ప్రెసిడెంట్ గా సిద్దంశెట్టి సాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు హెచ్ ఎం ఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలతో సిద్దంశెట్టి సాజన్ ను వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆ యూనియాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ హెచ్ ఎం ఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఓ ప్రకటన విడుదల చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన సాజన్ శాంతిఖనిలో పనిచేస్తున్నారు. హెచ్ ఎం ఎస్ యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా సాజన్ నియామకం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు.