8 March, 2026 | 2:49 AM

జీతభత్యాల నిర్ణయం..

04-03-2026 12:00 AM

ఏతేన భృతానా మభృతానాంచ 

విద్యా కర్మభ్యాం

భక్తవేతన విశేషం చ కుర్యాత్.. 

షష్టివేతనస్యాఢకం

కృత్వా హిరణ్యానురూపం 

భక్తం కుర్యాత్!

(కౌటిలీయం )కౌటిలీయం అయిదవ అధికరణం, మూడవ ఆధ్యాయంలో.. యువరాజు, రాజమాత, పట్టపురాణి, ఋత్విక్కు లు, ఆచార్యులు, మంత్రులు, సేనాపతులు మొదలైన ముఖ్యులకే కాక రాజపాలనలో సహకరించే ప్రతి ఒక్కరికీ వారివారి స్థాయి ననుసరించి, ఎవరెవరికి ఎంతెంత జీతభత్యాలు చెల్లించాలో స్పష్టపరచాడు ఆచార్య చాణక్య.

భృత్యులకు (శాశ్వత ఉద్యోగులకు), అభృత్యులకు (తాత్కాలిక ఉద్యోగులకు) వా రి వారి విద్యలు, కర్మలను బట్టి భక్తం (బత్తెం), ఆహారం లాంటి వాటిలోను వేతనాల్లోనూ విశేషం కనబరుస్తూ ఉండాలి. అరవై ఫణాలకన్నా తక్కువ జీతం పొందే వారికి అదనంగా బియ్యాన్ని బత్తెంగా ఇవ్వాలి, అం టాడు, చాణక్య. అలాగే రాజకార్యాల నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు అన్నమూ, జీతమూ గౌరవప్రదంగా ఇవ్వాలంటారాయన. అలాంటి కుటుంబాల్లో ఎవ రైనా మరణించినా, జబ్బుపడినా, ప్రసవించినా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని చెపుతాడు.

కార్యనిర్వహణ..

ఉద్యోగులు లేనిదే కార్యనిర్వహణ లేదు. వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారు, నిజాయితీ కలిగిన వారు, శ్రమించే నైజం కలిగిన ఉద్యోగుల (నైపుణ్యం కలిగిన, నైపు ణ్యం లేని) స్వేదమే ఉత్పత్తిగా రాజ్యాన్ని/సంస్థను నిలుపుతుంది. నైపుణ్యం కలిగినా, లేక పోయినా, నిబద్ధత కలిగిన వారికి అర్హత ప్రాతిపదికగా జీతభత్యాలను ఇవ్వడం ద్వా రా ఉద్యోగుల అనుభవం, విజ్ఞానం పాలనకు ఉపకరిస్తుంది. పని చేయడం కర్మయో గం అంటాడు, వివేకానంద.

పని చేయడాన్ని ఆరాధనగా చెపుతూ.. కర్తవ్యాన్ని ఆరాధనతో కార్లైల్ ముగించగా, బసవేశ్వరుడు పనిచేయడమే స్వర్గమంటూ ఫలితాన్ని కూడా చెబు తాడు. ఎప్పుడైతే పనిని పవిత్రయోగంగా భావిస్తామో, అప్పుడు పని చేసేవాడు, పనిచేసే విధానం, ఆ పనివల్ల వచ్చే ఫలితం, ఆ ఫలితాన్ని వినియోగించుకునే విధానం అన్నీ కూడా పవిత్రతను సంతరించుకుంటాయి. భారతీయ దృష్టికోణం.. శ్రమ, శ్రామికుడు, ధనము వీటి మధ్య ఉన్న సంబంధం సంఘర్షణ కాదది సమన్వయం అంటుంది. ఆ భా వనతో పనిచేసే ఉద్యోగులు పనిని ఉపాధిగా కాక ఉత్-యోగమునకు (గొప్పనైన యోగ ము) ఉపకరణంగా వాడుకుంటారు.

ఉద్యోగులు విజ్ఞానులైతే.. 

వారు పనిని ప్రేమిస్తూ పనిలో ప్రేరణను పొందుతారు. రాజ్య/సంస్థ సంస్కృతికి కట్టుబడి పనులు చేస్తారు. సృజనాత్మకతను ప్ర దర్శిస్తారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తిని ప్రదర్శిస్తారు. అ లాంటి వారిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి నాయకుడు మార్గదర్శన, సహకా రం అందించి వారిని ప్రోత్సహిస్తే.. సంస్థకు ప్రభావవంతమైన రెండవతరం నాయకత్వం లభిస్తుంది. అలాంటి వారిని రక్షించుకోవాల్సిన అవసరం నాయకులకు ఉంటుంది. అందుకే గౌరవప్రదమైన జీతభత్యాలు ఇవ్వాలంటాడు, చాణక్య. బాధ్యత కలిగిన నాయ కుడు..

తన సంస్థలోని ప్రతి ఉద్యోగిని, సంస్థ తో అనుబంధం కలిగిన ప్రతి వ్యక్తినీ సమానంగా గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. అలాంటి నాయకులే సంస్థలో బిందువు నుంచి విశ్వవ్యాప్తమౌతారు. అలాగాక బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడే నాయకుడు ఎప్పుడూ గౌరవాన్ని పొందలేడు. భారతంలో, సభా పర్వంలో నారదుడు ధర్మరాజును కొ న్ని రాజ్యపాలన అంశాలను అడగడం కనిపిస్తుంది. అందులో ‘కృతమెఱిఁగి కర్త నుత్త మ మతుల సభల సంస్తుతించి మఱవకత గు సత్కృతి సేయుదె?’అంటాడు, నన్నయ.

తనకు సహాయకారులుగా నిలిచిన వారిని సభాముఖంగా అభినందించడం, వారిని సరైన సమయంలో సత్కరించడం అవసరం. వారికది ప్రేరణగా నిలుస్తూ మరింతగా శ్ర మించి రాజ్య/ సంస్థ ఉన్నతికై పాటుపడేందుకు ఉపకరిస్తుంది. నిజానికి ఆర్థిక సంబం ధిత ప్రేరణలు ఉద్యోగులను ఉత్తేజితులను చేస్తాయని దానితో ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరుగుతాయని భావించడం పరిపాటి. కాని వాటికన్నా నలుగురి ముందు గుర్తింపునివ్వడం, పదవిని ఉన్నతీకరించడం, నిర్ణయా ల్లో భాగస్వాములను చేయడం వల్ల ఉద్యోగులు ఎక్కువ ప్రేరణను పొందుతారు. అలా గని జీతభత్యాలు సరిగా ఇవ్వని యజమాని వెంట ఎవరూ నడవరు.

నాయకుల అనుభవం..

నాయకుల జీవితానుభవం భావితరాల కు మార్గదర్శన చేస్తుంది. అలాగని వారి ప్రతి అనుభవం ఉపయుక్తం కాదు. ఏ అనుభవంలో సమస్య ఉన్నదో దానికి వారే విధ మైన పరిష్కారాన్ని పరోక్షంగానైనా సూచించగలిగారో ఆ అనుభవమే ఉపయుక్తం. సమస్య- పరిష్కారం వీటి బలాబలాలే ఆ అనుభవాలను సార్వకాలికంగా, సర్వజనీనంగా నిలుపుతాయి. 

అనుభవ జ్ఞానాన్ని అక్షరీకరించినప్పుడు వాస్తవికత, తార్కికత రెండు కళ్లుగా నిలుస్తాయి. ఒకటి గతాన్ని చూస్తే మరొకటి వర్తమానంలో విహరిస్తుం ది. అయితే వీటికి అతీతమైన మూడో కన్ను దార్శనికతగా, విజయానికి దర్పణంగా నిలుస్తుంది. దానిని సాకారం చేసుకోవడానికి నైపుణ్యాలు అవసరం. నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు ప్రేరణ అందించడానికి ప్రోత్సాహకాలు, వనరుల సమీకరణ అవసరమవుతాయి. ఇవన్నీ సరిగ్గా అమరినా వాటిని క్రమపద్ధతిలో పెట్టడానికి కార్యాచరణ ప్రణాళిక అవ సరమౌతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించి నాఅనుకున్న లక్ష్యా న్ని చేరలేము.

సంరక్షించే విధానం..

ప్రధానమంత్రి ఫిబ్రవరి 22న ‘మన్ కీబాత్‘లో మాట్లాడుతూ.. ఈ మధ్య ఢిల్లీలో జరి గిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026‘లో ఏఐ రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలను చూసి ప్రపంచ నేతలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారన్నారు. ముఖ్యం గా ‘అమూల్ బూత్‘లో జరిగిన ఏఐ ప్రదర్శనలో.. ఏఐ సహాయంతో జంతువులకు చికి త్స ఎలా జరుగుతుందో, రైతులు తమ పాల ఉత్పత్తులు నిరంతరాయంగా ట్రాక్ చేసుకోవడం ఎలా సాధ్యపడుతుందో చూపామని, దానికి ప్రపంచ నాయకులు ఆశ్చర్యపోయారని చెప్పారు.

అలాగే భారతీయ సంస్కృతికి సంబంధించిన పురాతన గ్రంథాలు, పురాతన జ్ఞానం, రాతప్రతులు ఏఐ సహాయంతో సంరక్షించే విధానాన్ని ఆధునిక తరాలకు అర్థమయ్యే రీతిలో వివరించామని ప్రధాని చెప్పారు. ఏఐ రంగంలో ఇప్పటికే ముందు న్న చైనా, అమెరికాలతో పోటీపడే స్థాయిలో ఉన్న భారత్ వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో పూర్తిస్థాయి సార్వభౌమత్వా న్ని సాధిస్తుందనే విశ్వాసాన్ని ఏఐ సదస్సు సిఏఓ అభిషేక్ సింగ్ ప్రకటించారు.

దీనికి ఆ యా రంగాల్లో దీక్షాదక్షతలతో పనిచేస్తున్న ఉద్యోగులు అందుకుంటున్న జీతభత్యాలే గాక, సాధించగలమన్న వారి ఆత్మవిశ్వాసం, వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రేరణయే ప్రధాన కారణంగా భావించాలి.