19 May, 2026 | 3:59 AM

నకిలీ ధ్రువపత్రాలతో భూవిక్రయం

22-04-2024 12:30 AM

l ఇదివరకే విక్రయించిన భూమి తిరిగి అమ్మకం

l ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు

కరీంనగర్, ఏప్రిల్ 21 (విజయక్రాం తి): విక్రయించిన భూమికే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి మరొకరికి అమ్మిన ఘటనపై నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపగా, మరో ఇద్ద రు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన తెల్ల రాజయ్య పవర్‌లూమ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2003 సంవత్సరంలో కరీం నగర్ శివారు తీగలగుట్టపల్లిలోని సర్వేనంబర్ 233/E లో ఉన్న 293.33 చద రపు గజాల స్థలాన్ని మూల గౌరారెడ్డి వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొన్నాడు.

మూల గౌరారెడ్డి మరణానం తరం అతని కొడుకు మూల తిరుమల్‌రెడ్డి గతంలో విక్రయించిన ప్లాట్లకు గల 50 ఫీట్ల రోడ్డు తమకు చెందిందేనని ఆక్రమించుకున్నాడు. దానిని రెండు ప్లాట్లుగా విభజించి తిరుమల్‌రెడ్డి తల్లి మూల వీర మ్మ పేరిట తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారు. దానిని మూల సూర్యప్రకాష్‌రెడ్డి, లంక శేఖర్‌కు విక్రయించినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృ ష్టించడమే గాక ప్లాట్‌లో గోడను నిర్మించారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కరీంనగర్ రూరల్ పోలీసులు నలుగురిపై పలు సెక్ష న్ల కింద కేసు నమోదు చేశారు. మూల తిరుమల్‌రెడ్డి, లంక శేఖర్‌ను అరెస్టు చేసి  కోర్టులో హాజరు పరచగా..14 రోజుల రిమాండ్ విధించిందని కరీంనగర్ రూర ల్ ఇన్స్‌పెక్టర్ ఏ ప్రదీప్‌కుమార్ తెలిపా రు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.