సమంతకు పితృ వియోగం
30-11-2024 12:00 AM
హీరోయిన్ సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేస్తూ ‘నాన్నా.. మళ్లీ మనం కలిసేంతవరకూ..’ అని పేర్కొన్నారు.
దీన్ని చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే, సమంత తన తండ్రి మరణానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. కానీ, అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జోసెఫ్ మరణించారని తెలుస్తోంది. తెలుగు అయిన జోసెఫ్ ప్రభు మలయాళీ కుటుంబానికి చెందిన నినెట్ ప్రభును పెళ్లి చేసుకున్నారు.






