calender_icon.png 21 January, 2026 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి వద్దకే సమ్మక్క సారలమ్మ మహాప్రసాదం

21-01-2026 06:48:36 PM

కుబీర్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ ద్వారా సమ్మక్క సారక్క ప్రసాదాన్ని ఆర్టీసీ కౌంటర్లో అందుబాటులో ఉంచినట్లు నిర్మల్ డిఎం పండరి తెలిపారు. దేశం లోనే అతిపెద్దదైన  గిరిజన  వన దెవతల మహా జాతర సమ్మక్క సారలమ్మ వెళ్లలేని వారికి ఆర్టీసీ వారు ఒక గొప్ప అవకాశాన్ని కలిపిస్తున్నారు. నిర్మల్ బస్టాండ్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి కేవలం 299/- రూ! ! లకే మీ ఇంటి వద్దకు ఆ మహా ప్రసాదాన్ని కార్గో ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. వీటికి సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎం) నవీన్ కుమార్ స్టేషన్ మేనేజర్ ఏ.ఆర్.రెడ్డి, వి.జి.రెడ్డి, కార్గో డి. ఎం.ఈ. కిషోర్ కుమార్, కంట్రోలర్లు ఎం.సి.శేఖర్, డి. గంగన్న పాల్గొన్నారు.