29 June, 2026 | 1:58 AM

కొత్తగా బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయండి

29-06-2026 12:59 AM
  1. ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
  2. మంత్రి పొన్నంతో భేటీ అయిన ఎంపీ 
  3. చర్చల్లో పాల్గొన్న బీసీ సంఘాల నేతలు

ముషీరాబాద్, జూన్ 28(విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ హాస్టల్ సీట్లకు బాగా డిమాం డ్ ఉన్నందున కొత్తగా అన్ని జిల్లాల్లో కలిపి అదనంగా 120 బీసీ కాలేజి హాస్టళ్లు, 150 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రా ష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ సీట్లు దొరక్క విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు భరించలేక చదువు మానుకుంటున్నారని వెంటనే ప్రభు త్వం స్పందించి మంజూరు చేయాలని విజ్ఞ ప్తి చేశారు.

ముఖ్యమంత్రితో చర్చలు జరిపి కొత్త హాస్టళ్లు మంజూరు చేస్తామని, అలాగే గురుకులాల్లో అదనపు సెక్షన్లు, సీట్లు పెంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇ చ్చారు. మంత్రితో చర్చలు జరిపిన వారిలో బీసీ సంఘాల నేతలు జిల్లపల్లి అంజి, నీల వెంకటేష్ ముదిరాజ్, జి.అనంతయ్య, గుజ్జ కృష్ణ, బీమ రాజు, లింగయ్య యాదవ్, మో డీరాందేవ్, రాజేందర్ పాల్గొన్నారు.