15-11-2025 01:14:23 AM
తాడ్వాయి, నవంబర్, 14 (విజయ క్రాంతి ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలలో పేరుకుపోయిన ఇసుకమేటను వెంటనే తొలగించాలని సిపిఓ మండల ప్రత్యేక అధికారి రఘునందన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో ఆయన శుక్రవారం భారీ వర్షాలకు పంట పొలాల్లో చేరిన ఇసుకమేటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకంలో ప్రతిపాదనలు రూపొందించి వెంటనే రైతు ల పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలను తీసివేయాలని అధికారులకు సూచిం చారు. కొందరు రైతులు ప్రత్యేక అధికారితో మాట్లాడుతూ.. ఇంకా పంట పొలాలు పూర్తికాలేదని పొలాలు అయిపోయిన తర్వాత ఇసుక మేటలను తొలగించాలని కోరారు.
తొందర తొందరగా పంట పొలాల కోత పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఆయన తాడువాయిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించారు. ఎంపీడీవో సాజిద్ అలీ, ఏపిఓ కృష్ణ గౌడ్, పంచాయతీ కార్యదర్శి పరమేశ్వరి, క్షేత్ర సహాయకుడు హనుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.