calender_icon.png 15 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

15-11-2025 01:15:49 AM

అర్మూర్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : అర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న పాలిత కుమార లహరి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటి నిర్మాణ పనుల్లో ఉండగా తన చేతిలోని అల్యూమినియం పట్టి బిల్డింగ్ పైన ఉన్న కరెంట్  వైర్లకు ప్రమాదవశాత్తు తాకి కరెంట్ షాక్ తగిలి పడిపోయినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.హెచ్.ఓ. వివరించారు.