15-11-2025 01:11:04 AM
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల
కామారెడ్డి, నవంబర్14 (విజయక్రాంతి): జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి బాల సదన్లో జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణి మాట్లాడుతూ ప్రతి చిన్నారి సురక్షిత వాతావరణాల్లో పెరగడానికి తన ప్రతిభను వికసించుకోవడానికి అవకాశాలు సమాజం కల్పించడం జరుగుతుందని అన్నారు.
వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల మాట్లాడుతూ బాలసదంలోని పిల్లలు మంచి అధికారులుగా ఎదిగి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే స్థాయికి చేరాలని అన్నారు. పలువురు విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి అలరించారు. ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులకు చాక్లెట్లు స్టీల్ కాపీ మగ్గులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిపిఓ స్రవంతి, సిడబ్ల్యుసి సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ, కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యం లో జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమo శుక్రవారం గవర్నమెంట్ చిల్డ్రెన్ హోమ్ (బాల సదన్), కామారెడ్డిలో నిర్వహించ బడింది. ఈ కార్యక్రమానికి మిస్ టి. నాగరాణి, కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీలా , డిసిపిఓ ౄr స్రవంతి , సి డబ్ల్యూ సి సభ్యురాలు స్వర్ణలత పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మాట్లాడుతూ.. జవహర్లాల్ నెహ్రూ భారత మొదటి ప్రధాన మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటాము అని అన్నారు. అనంతరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీలా మాట్లాడుతూ అనంతరం బాల సదన్ కు చెందిన పిల్లలు నృత్య ప్రదర్శనలు చేసి అందర్నీ అలరించారు.
పిల్లల ప్రతిభను అభినందించారు. గేమ్స్లో పాల్గొన్న పిల్లలకు బహుమతులను అందజేశారు. అనంతరం చాక్లెట్లు స్టీల్ కాఫీ మగ్గులను పిల్లలకు స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది ఖాన్, సాయి ప్రణీత్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.