7 May, 2026 | 4:58 AM

బాబోయ్.. ఇసుక లారీలు!

24-05-2024 12:05 AM

ఇసుక లారీలు ప్రజల పాలిట మృత్యు కుహరాలుగా మారుతు న్నాయి. పది రోజుల క్రితం భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో ఇసుక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నిల్చున్న వారిమీదికి రావడంతో ముగ్గురు లారీ కింద పడి మరణించారు. మరి కొంతమంది క్షతగాత్రుల య్యారు. కోట్లాది రూపాయలతో వేయిం చిన రోడ్లు లారీల ప్రయాణాలతో ధ్వంసమ వుతున్నాయి. నియమ నిబంధనలు ఉల్లం ఘిస్తున్న లారీల డ్రైవర్లు మద్యం సేవించి లారీలు నడిపి అమాయకుల చావుకు కారణమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నా యి. రోడ్లమీద ప్రయాణించే వాహనదా రులు ఇసుక లారీలు కనిపిస్తే భయకంపి తులు అవుతున్నారు. ప్రయాణికులు ప్రాణా లను ఆరచేతిలో పెట్టుకోవలసి వస్తున్నది. 

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ నేపథ్యం తోపాటు కొంత పారిశ్రామికంగా అభివృ ద్ధిలో ముందంజలో ఉన్న సిరుల మాగాణి అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో ఇసుక క్వారీలు వున్నాయి. ఇక్కడి నుండి వేలాది లారీలు, టిప్పర్‌ల ద్వారా ఇసుక నిత్యం హైదరాబాద్, భువనగిరి, హన్మకొం డ ప్రాంతాల వైపు, కరీంనగర్, మంథని, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలుసహా మహారాష్ట్ర సరిహద్దు రహదారులు వైపు అధికంగా వెళుతున్నాయి. ఇవన్నీ పలు ప్రాంతాలకు అనుసంధానమైన రహదా రులు కావడంతో నిత్యం రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. జిల్లా కేంద్రానికి అతి సమీ పంలో థర్మల్ విద్యుత్ కేంద్రం, సింగరేణి, అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల నిమిత్తం వినియోగింపబడే వివిధ వాహ నాలుసహా ప్రజారవాణా వాహనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 

భూపాలపల్లి కేంద్రంగా ఉన్న రహ దారులపై నడుస్తున్న లారీలు అతివేగంగా, నిర్లక్ష్యపు ధోరణితో వెళ్ళడంతో సమీప గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. అధిక లోడ్‌తో కూడిన లారీలు, ఇతర భారీ వాహనాలు ఇష్టానుసారంగా అడ్డూ, అదు పు లేకుండా వెళ్ళడం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.  ఒక అంచనా మేరకు నెలకు సుమారు ఇరవయికి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై మూగజీవులు సైతం వాహనాలు ఢీకొని మరణిస్తున్నాయి. పూర్తిస్థాయిలో అవగాహ న లేకుండా ఎలాంటి పర్యవేక్షణ లేక నిర్లక్ష్యం గా సంబంధిత లారీ డ్రైవర్లు హద్దుమీరిన పోకడలతో లారీలను నడుపుతున్నారు. 

జిల్లా ప్రధాన రహదారులు నెత్తురోడడం చూసి ప్రజలు భయాందోళనలకు గురవుతు న్నారు. ప్రజలు పలుమార్లు రోడ్డు, రవాణా శాఖ అధికారులకు, ప్రజాప్రతిని ధులకు లారీ ప్రమాదాల సమస్యల గురించి విన్న పాలు చేసినా నామమాత్రపు చర్యలు తీసు కుంటునారే తప్ప, పూర్తి స్థాయిలో పటి ష్టమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. రహదారులకు ఇరు పక్కలకు, క్రాసింగ్‌ల వద్ద హెచ్చరికల బోర్డులు, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ విధానాలకు సంబం ధించిన సూచికలను ఏర్పాటు చేయాలి.  స్పీడ్ బ్రేకర్‌లను అమ ర్చాలి. ట్రాఫిక్, రోడ్డు రహదారుల శాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ లారీ ల పర్మిట్‌ను, డ్రైవర్ ధృవీకరణ పత్రాలను పరీక్షించాలి. అధికారులు వెంటనే ఇలాంటి రక్షణ, భద్రతా చర్యలు తీసువా ల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 కామిడి సతీశ్ రెడ్డి