20 June, 2026 | 7:02 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కరించాలి

20-06-2026 05:55 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల బృందం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ... కరీంనగర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఇసుక సరఫరా సమస్యను పరిష్కరించి నిర్మాణాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపై సానుకూలంగా స్పందించిన ఆర్డీవో సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.