రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా
15-06-2024 02:03 PM
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝాను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన అనురాగ్ జయంతిని కరీంనగర్ కలెక్టర్ గా నియమించింది. ట్రాన్స్ స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిన సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.






