పిల్లల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
15-06-2024 11:40 AM
చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం చాకేపెల్లి గ్రామంలోకి శనివారం గుర్తు తెలియని దుండగులు సంచరించారు. పిల్లలను బెదిరిస్తుండగా గ్రామస్తులు చూసి ప్రశ్నించగా అక్కడినుంచి పారిపోయారు. అనుమానం వచ్చి ఓ వ్యక్తి పట్టుకున్న గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది






