14 July, 2026 | 6:12 PM

ధూల్‌పేట్‌ గంజాయి లేడీ డాన్‌ అరెస్ట్‌.. పరారీలో కొడుకు, కూతురు

23-09-2024 07:16 PM

హైదరాబాద్: దూల్ పేట్ లో గంజాయి సరఫరా చేస్తున్న కీలక నిందితురాలు అరెస్ట్ అయింది. సంధ్యాబాయి దూల్ పేట్ లో యథేచ్ఛగా గంజాయి అమ్ముతోంది. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సంధ్యాబాయిని సోమవారం పట్టుకున్నారు. నిందితురాలి వద్ద నుంచి 1,863 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు రూ. 62 వేల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సంధ్య కుమారై సంజనబాయి, కుమారుడు అభిషేక్ సింగ్ పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.