29 July, 2026 | 12:50 AM

ప్రీ-ప్రైమరీ పోస్టుల నియామకాల్లో భారీ అక్రమాలు

29-07-2026 12:00 AM

విజిలెన్స్ విచారణకు ఆదేశించండి

విలేకర్ల సమావేశంలో సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ 

ఖమ్మం, జులై 28 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద మంజూరు చేసే రుణాలు, తథాస్తుగా పాఠశాల విద్యారంగంలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల నియామ కాల్లో భారీగా అవకతవకలు జరిగాయని భారత రాష్ట్ర సమితి పార్టీ తీవ్రంగా ఆరోపించింది.

జిల్లాలో తలెత్తిన ఈ అక్రమాలపై త క్షణమే విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎ మ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు సండ్ర వెంక ట వీరయ్య మాట్లాడుతూ,పీఎంఈజీపీ రు ణాల్లో బినామీల హవా నిరుద్యోగులకు దక్కని ఫలాలు అంటూ ఎద్దేవా చేశారు.

స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని జిల్లాలోని కొందరు దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంక్ అధికారులు కలసి పక్కదారి పట్టించారని ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 90 శాతానికి పైగా ఎ లాంటి యూనిట్లు (పరిశ్రమలు) స్థాపించకుండానే రూ. 10 కోట్లకు పైగా రుణ సబ్సిడీలను బినామీల పేరిట బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి పరిశీలన, జియో ట్యాగింగ్ నిబంధనలను బొందపెట్టి దళారులతో కుమ్మక్కైన జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు పెద్ద ఎత్తున ఈ రుణాలు మంజూరు చేశారని విమర్శించారు.

నిజమైన అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులకు బ్యాంకు లోన్లు ఇవ్వకుండా వేధిస్తుంటే, ఫైరవీకారులకు మాత్రం సబ్సిడీలు క్షణాల్లో విడుదలవుతున్నాయని తెలిపారు. ఈ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ వెంటనే విజిలెన్స్ విచారణ కమిటీని నియమించాలని, అక్రమాలకు పాల్పడిన సత్తుప ల్లి బ్రాంచ్ మేనేజర్ సహా బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయా నియామకాల్లో మెరిట్కు తిలోదకాలు

విద్యాశాఖ నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల పోస్టులను ఎ లాంటి ఇంటర్వ్యూలు లేకుండా విద్యా అర్హతల (మెరిట్) ఆధారంగా మాత్రమే భర్తీ చే యాల్సి ఉందని వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కానీ ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా 30 మార్కులు ఇంట ర్వ్యూలకు, ఆయా పోస్టులకు 50 మార్కులు ఇంటర్వ్యూలకు కేటాయిస్తూ కొత్త మార్గదర్శకాలు రూపొందించారని ఆరోపించారు.

బీఈడీ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న మెరిట్ అభ్యర్థులను పక్కనపెట్టి, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా భర్తీ చేసిన 114 పోస్టుల అభ్యర్థుల మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలలో వేసిన మార్కుల వివరాలను పారదర్శకంగా జిల్లా నోటీస్ బోర్డులో, మండల పరిధిలో పబ్లిక్ డొమైన్లో బహిర్గతం చేయాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా మంజూరైన రుణాలపై, ఆయా యూనిట్ల ఉనికిపై నిష్పాక్షిక విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని, దరఖాస్తు చేసుకున్న 1400 మందికి పైగా నిరుద్యోగుల వివరాలు, వారి విద్యార్హతలు, వేసిన ఇంటర్వ్యూ మార్కులను వెంటనే బహిరంగపరచాలని, ఈ అక్రమాల్లో భాగస్వాములైన ఇండస్ట్రియల్, ఖాదీ, బ్యాంకింగ్, విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధితులైన నిరుద్యోగ యువతకు మరియు అర్హులైన అభ్యర్థులకు బిఆర్‌ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, అవసరమైతే జిల్లా కలెక్టర్ను కలిసి బాధితుల ఆధా రాలతో నిలదీస్తామని హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ, మాజీ మండ ల, నగర పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, నాయకులు బిచ్చాల తిరుమల రావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.