calender_icon.png 29 July, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందించిన వాజేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు

29-07-2025 11:41:34 AM

వాజేడు (విజయక్రాంతి): వాజేడు మండల పరిధిలో గల ఎడుజర్లపల్లి గ్రామానికి చెందిన ఎక్కబోయిన శేషమ్మ అనారోగ్యానికి గురై వరంగల్ దవఖానాలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వాజేడు మండల నాయకులు శేషమ్మ దహన సంస్కారాల నిమిత్తం ఏడువేల రూపాయలు ఆమె కుమార్తె స్వప్నకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకినబోయిన నరసింహారావు, చెన్నం మోహన్ రావు, ఎర్రకట్ల సుమన్, బట్టు బాబు తదితరులు పాల్గొన్నారు.