28 August, 2026 | 2:08 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

టాలీవుడ్‌పై కన్నేసిన సంజయ్ కపూర్ తనయ

01-07-2026 12:00 AM

బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ తనయ శనయ కపూర్ టాలీవుడ్‌పై కన్నేసింది! బాలీవుడ్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న శనయా.. నిరుడు ‘ఆఖోంకి గుస్తాకియా’ అనే రొమాంటిక్ డ్రామాతో హీరోయిన్‌గా మారింది. ఆమె ఇటీవల ‘తు యా మై’ అనే సర్వైవల్ థ్రిల్లర్‌తోనూ అలరించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా శనయకు మాత్రం నటిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఈ నేపథ్యంలో సరైన బ్రేక్ కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉండటంతో శనయా కపూర్ టాలీవుడ్ అరంగేట్రం కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ఆఫర్‌ను సైతం సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా  హీరోగా నటించిన ‘జాంబీ రెడ్డి’ చిత్రం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి-2’ తెరకెక్కుతోంది. ‘జాంబీ రెడ్డి’ తొలి భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతూనే నవ్వించిందో.. ఈ పార్ట్-2 కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఈ సినిమాలోనే శనయా కపూర్ హీరోయిన్‌గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందనని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా శనయా తెలుగగు పరిశ్రమలోకి అడుగుపెడితే,  మంచి బ్రేక్ అందుకోవటమే కాక కెరీర్ మలుపు తిరిగే ఛాన్స్ ఉందనేది ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో వినవస్తున్న ముచ్చట.