13-01-2026 10:50:28 PM
హనుమకొండ,(విజయక్రాంతి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ వారి సౌజన్యంతో సంక్రాంతి సంబరాలు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణు మాధవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపి విజయ్ కుమార్,విశ్వకవి సిరాజుద్దీన్,చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కటకం పెంటయ్య, ఆకుల సదానందం, కామిశెట్టి రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.చిన్నారుల శాస్త్రీయ నృత్యం, పాటలు, మిమిక్రీలతో అలరించారు. అనంతరం పాల్గొన్న అందరికీ మెమొంటోలు, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ స్టేట్ కన్వీనర్ ఎస్ కే బాబర్, మహిళా విభాగం కన్వీనర్ కొండపల్లి దీపిక, కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ కామిశెట్టి రంజిత్ కుమార్, కుచన నాగజ్యోతి, నల్ల లక్ష్మీనారాయణ, గూడూరు అంజలి, గాయనీ, గాయకులు పాల్గొన్నారు.