16 March, 2026 | 3:32 PM

Breaking News

మంథని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం   •   తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ   •   చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి   •   అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు   •   రాష్ట్రం అప్పుల్లో ఉంది..పైసలు లేక ప్రాజెక్టులు ముందుకు పోతలే   •   యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •  

రోడ్డు భద్రతలపై అవగాహన

13-01-2026 10:48 PM

బీబీపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల బస్టాండ్ పరిసర ప్రాంతంలో మంగళవారం స్థానిక ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత  పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు  తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆ వాహనంకు సంబంధించిన ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు వెంటబెట్టుకొని ప్రయాణం కొనసాగించాలి. డ్రైవింగ్ చేస్తున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, వాహనదారులు ఎట్టి పరిస్థితిలో మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదని, ఆటోలు కార్లు భారీ వాహనాలు సరియైన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.

18 ఏళ్ల లోపు వయసుగల బాల బాలికలు వాహనాలను నడపకూడదని అలా నడిపిన యెడల తల్లిదండ్రులకు వాహన యజమానులకు భారీ మొత్తంలో జరిమానా విధించాల్సి వస్తుందని ఆయన సూచించారు. అంతేకాకుండా సంక్రాంతి పండగ సందర్భంగా ఎగురవేస్తున్న గాలిపటాలకు చైనా దారాలు, మాంజా వంటి వాటిని కట్టి ఎగురవేయకూడదని అలా ఎగరవేసిన యెడల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరైనా అలాంటి దారాలతో గాలిపటాలను ఎగరవేయడం, ఎవరైనా పండగ సందర్భంగా జూదాలు, కోడి పందాలు వంటిని ప్రోత్సహించకూడదని గుట్టుగా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షకు గురి అవుతారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది రవీందర్, స్థానిక ప్రజలు తదితరులున్నారు.