calender_icon.png 14 January, 2026 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాపేటలో ఘనంగా సంక్రాంతి క్రికెట్ పోటీలు

14-01-2026 06:43:27 PM

క్రీడలతోనే మానసిక ఉల్లాసం: ఎస్సై ప్రశాంత్ రెడ్డి..

కోనరావుపేట,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో క్రికెట్ పోటీలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. మల్కాపేట సర్పంచ్ కోనరావుపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బోయినీ దేవరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా పోటీలకు కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి ప్రాణాంతక వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.

మద్యం ఇతర చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, చక్కగా చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడాలని యువకులకు సూచించారు. క్రీడలు ఆడటం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం బోయినీ దేవరాజు మాట్లాడుతూ యువతను చెడు వ్యసనాలకు దూరం చేసి, వారిని శారీరకంగా, మానసిక చురుగ్గా ఉంచేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.