calender_icon.png 14 January, 2026 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు

14-01-2026 06:39:55 PM

ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి 

మంథని,(విజయక్రాంతి): మకర సంక్రాంతి పర్వదినమున పురస్కరించుకొని మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో బుధవారం ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ ఫోటోలలో గెలుపొందిన విజేతలకు మంథని మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓడ్నాల ప్రవళిక శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ పోటీలు మంథని జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మూల సరోజన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం మన సాంప్రదాయమని ఆమె అన్నారు. ఈ పోటీలలో 25 మంది మహిళలు పాల్గొని వివిధ రకాల రంగవల్లులతో అలరించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ ఓడ్నాల ప్రవళిక శ్రీనివాస్  చేతుల మీదుగా ప్రథమ బహుమతి కొమురోజు సరిత,

ద్వితీయ బహుమతి చేమంతుల శ్రీవాణి, తృతీయ బహుమతి ఎస్ మనస్వి లకు బహుమతులు ప్రధానం చేశారు .అంతేకాకుండా పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ముగ్గులతో మన ముంగిల్లు కళకళలాడుతాయని ప్రతి ఒక్కరు కూడా రంగురంగుల ముగ్గులు ఇంటి ముందట చిన్నాపెద్దా తేడా లేకుండా వేస్తారని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గెలుపొందిన విజేతలను అభినందించారు.