calender_icon.png 14 January, 2026 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గులతో గోబ్బేమ్మ ల పండుగ

14-01-2026 06:47:18 PM

మోతే,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాఘవ పురం ఎక్స్ రోడ్డు గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ కోల లింగయ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన మహిళలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి బహుమతులు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం రైతులు వేసిన పంటలు దండిగా పండి పుట్ల కొద్దిగా బండ్ల పైన ఇంటి కి పంటలు వచ్చిన సమయంలో గ్రామాలలో ప్రతి ఒక్కరు పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు ధరించి ఇండ్ల ముందు సంక్రాంతి ముగ్గులు వేసుకొని గోబ్బేమ్మ లను పెట్టుకోవడం ఒక సాంప్రదాయం గా వస్తున్నదని చెప్పారు. ఇంటి ముందు గంగిరెడ్డులు ఆడుతూ హరిదాసులు పడుతూ పండుగ ప్రతిష్ట ను కీర్తించే విధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని. ఆకాంక్ష గా అభివర్ణించారు.