calender_icon.png 12 January, 2026 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి ముగ్గుల పోటీలు

11-01-2026 12:00:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ అర్బన్, జనవరి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బి.ఆర్.ఎస్ పార్టీ దేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే రామపురం మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్‌లోని కేఎల్‌ఆర్ నగర్లో ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు మళ్లీ కెసిఆర్‌ని గుర్తు చేసుకుంటున్నారన్నారు. మహిళలను సైతం ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బాసురాధి భాస్కర్ యాదవ్.మాజీ సర్పంచ్ వీర్లపల్లి రాజ మల్లారెడ్డి.బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్.కోల వెంకటేష్. శేఖర్ రెడ్డి. బాబు యాదవ్ గణేష్.సిహెచ్ నర్సింగ్ గౌడ్. నీలిమ. విట్టల్ తదితరులు పాల్గొన్నారు.