calender_icon.png 11 January, 2026 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాంటీ మలేరియా కిట్ల పంపిణీ

11-01-2026 12:00:00 AM

కిట్లను అందజేసిన బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్

సికింద్రాబాద్ జనవరి 10 (విజయక్రాంతి) : కంటోన్మెంట్ నియోజకవర్ న్యూ బోయిన్ పల్లి కంటోన్మెంట్ సర్కిల్ కార్యాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న యాంటీ మలేరియా సిబ్బంది కి ప్రముఖ సంఘ సేవకులు గౌతమ్ జైన్ కుమార్తె దిశా జైన్ ఆధ్వర్యంలో షూస్,మాస్కులు, హ్యాండ్ గ్లౌజస్, జరికిన్స్‌తో కూడిన కిట్లను పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై బోయిన్‌పల్లి ఒకటో వార్డ్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో శనివారం కిట్లను అంద జేశారు.

ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్ధి దశ లోనే సామాజిక సేవ కార్యక్రమాలులో దిశా జైన్ పాల్గొనడం అభినందనియమని అన్ని జంపన ప్రతాప్ ప్రసంశించారు.ఈ కార్యక్రమంలో భరత్ సింగ్,శానిటేషన్ దాఫెదార్లు విజయ్ కుమా  రామకృష్ణ, ఎం.అర్.రాజు, సాయిబాబా యాదవ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.