15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భక్తి, ఆధ్యాత్మిక బావాలతో సంత్ నిరంకారి

08-02-2026 12:00 AM

ఎన్టీఆర్ స్టేడియంలో రెండు రోజుల పాటు సంత్ నిరంకారి మిషన్

భక్తులకు సందేశాన్నిచ్చిన సద్గురు మాతా సుదీక్ష జీ మహారాజ్

ముషీరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సంత్ నిరంకారి మండల్ ఆధ్వర్యంలో శనివారం దక్షిణ భారత సంత్ నిరంకారి సమా గం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది, సంత్ నిరంకారి మిషన్ ప్రయా ణంలో సద్గురు మాత సుదీక్ష జీ మహారాజ్, నిరంకారి రాజపిత రమిత్ జీ ల సమక్షంలో ఈ సమాగం ప్రారంభమైంది. దీంతో వేలాది మంది భక్తుల ఆధ్మాత్మిక బావాలతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణమంతా భక్తి పారవ శ్యంతో  మార్మోగింది.

దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు సద్గురు మాతా సుదీక్షా జీ మహరాజ్ ను సందర్శించి ఆశీర్వచనాలు పొందారు. ఈ సంద ర్భంగా భక్తులు,  విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు  అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై సద్గురు మాత సుదీక్ష జీ మహారాజ్  ఆశీస్సులు పొందారు.