17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి

08-02-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ మేరకు శవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలో అర్హులైన124మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముషీరాబాద్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ తో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో పేద ఆడబిడ్డల పెళ్లిల్ల కోసం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాన్ని ప్రారంభించి పేద ఆడ బిడ్డలకు అండగా నిలిచారన్నారు.

అర్హులైన లబ్దిదారులు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకున్నట్లయితే చెక్కులు రావడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలన అధికారి సౌజన్య, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి ఎం. ఆరవింద్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతరాజు భాస్కర్, విడి కృష్ణ, ప్రభాకర్, బీఆర్‌ఎస్ నేతలు శ్రీనివాస్ యా దవ్, రాజశేఖర్ గౌడ్, కొండా శ్రీధర్‌రెడ్డి, టి. సోమన్, వై.  శ్రీనివాస రావు శ్రీధర్ చారి, ముఠా నరేష్, మారిశెట్టి నర్సింగ్ రావు, జమాలొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.